ట్రంప్‌తో వివాదం.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ – పేరేంటో తెలుసా..?

ట్రంప్‌తో వివాదం.. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ - పేరేంటో తెలుసా..?

ఎలాన్ మస్క్ (Elon Musk), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో, మస్క్ (Musk) కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంపై ఆయన ఎక్స్‌(X)లో పోల్ నిర్వహించగా, 80 శాతం మంది (80 Percent People) కొత్త పార్టీకి మద్దతు (Support) తెలిపారు. ఈ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ (The America Party)అనే పేరు(Name)ను నెటిజన్లు సూచించగా, మస్క్ దీనిపై సానుకూలంగా స్పందించారు. ఈ పేరు ఆయన గతంలో ట్రంప్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన ‘అమెరికా పీఏసీ’ (America PAC) పేరుతో సమానంగా ఉంది. ఈ పోల్ ఫలితాలను ‘ప్రజలు మాట్లాడారు, అమెరికాలో 80 శాతం మధ్యవర్తులను సూచించే కొత్త పార్టీ అవసరం’ అని మస్క్ వ్యాఖ్యానించారు.

మరోవైపు, రష్యా (Russia) నుండి మస్క్‌కు ఆసక్తికర ఆఫర్ వచ్చింది. ట్రంప్‌తో విభేదాల నేపథ్యంలో, అవసరమైతే మస్క్‌కు రాజకీయ ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా కమ్యూనిస్ట్ పార్టీ (Russia Communist Party) డిప్యూటీ డిమిత్రీ నోవికోవ్(Dmitry Novikov)ర్కొన్నారు. అయితే, మస్క్‌కు ఆశ్రయం అవసరం లేదని, ఆయన సొంత రాజకీయ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని నోవికోవ్ అన్నారు. రష్యా ప్రెసిడెన్షియల్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ ఈ వివాదంపై స్పందిస్తూ, ఇది అమెరికా అంతర్గత విషయమని, తాము జోక్యం చేసుకోబోమని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment