మలయాళ నటి కల్యాణి ప్రియదర్శన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె ఇటీవల తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను నటించిన ‘కొత్త లోకం’ సినిమాలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో నటించడానికి ఆరు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో భిన్నమైనదని, ఇది తనకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పారు.
తన చిన్ననాటి గురించి మాట్లాడుతూ, తను పుట్టింది చెన్నైలో అని, అయితే తల్లిదండ్రులు సినీ పరిశ్రమలో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే షూటింగ్ వాతావరణం అలవాటయిందని చెప్పారు. ఈ కారణంగానే సినిమాలపై ఆసక్తి పెరిగిందని తెలిపారు. అలాగే, తన సన్నిహితుడు దుల్కర్ సల్మాన్‌తో ఉన్న స్నేహం గురించి వెల్లడిస్తూ, తనకు ఏ కష్టం వచ్చినా లేదా ఏ సలహా కావాలన్నా మొదట అతడికే ఫోన్ చేస్తానని చెప్పారు. దుల్కర్ తనకు ఎంతో అండగా ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం కల్యాణి మలయాళ, తెలుగు చిత్రాల్లో వరుసగా నటిస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకువెళుతున్నారు.








