సిల్వర్ స్క్రీన్‌పై డ్యూయల్ రోల్స్.. ట్రెండ్ మళ్లీ మొదలు

సిల్వర్ స్క్రీన్‌పై డ్యూయల్ రోల్స్.. ట్రెండ్ మళ్లీ మొదలు

చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌ (Chiranjeevi – Anil Ravipudi Combination)లో తెరకెక్కుతున్న మెగా 157 చిత్రం (Mega 157)లో మెగాస్టార్ డ్యూయల్ రోల్‌ (Dual Role)లో కనిపించబోతున్నారు. ఒక పాత్ర అనిల్ మార్క్ కామెడీతో అలరిస్తే, మరో పాత్ర చిరు స్టైల్ యాక్షన్ మోడ్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ డబుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో మల్టీ రోల్స్ ట్రెండ్ (Multi-Roles Trend) గట్టిగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కబోయే గ్లోబల్ మూవీలో బన్నీ ఏకంగా ట్రిపుల్ రోల్‌ (Triple Role)లో నటించబోతున్నారు. ఈ జనరేషన్‌లో ట్రిపుల్ యాక్షన్ చేస్తున్న తొలి హీరోగా ఐకాన్ స్టార్ రికార్డు సృష్టించబోతున్నారు.

ఎన్టీఆర్ ‘దేవర’లో డ్యూయల్ రోల్
రీసెంట్‌గా ఎన్టీఆర్ (NTR) ‘దేవర'(Devara) సినిమాలో డ్యూయల్ రోల్‌లో తండ్రీకొడుకులుగా నటించారు. తొలి భాగంలో ఒకే ఫ్రేమ్‌లో రెండు పాత్రల్లో కనిపించకపోయినా, దేవర 2లో ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఇది అభిమానులకు మరింత పండగ చేయనుంది.

రాజాసాబ్‌లో డబుల్ బొనాంజా
డార్లింగ్ ప్రభాస్ (Darling Prabhas) కూడా డబుల్ బొనాంజా (Double Bonanza) ప్లాన్ చేస్తున్నారు. ‘ది రాజాసాబ్’ సినిమాలో రెండు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఒక పాత్రలో స్టైలిష్ లుక్‌లో అదరగొడితే, మరో లుక్‌లో ఓల్డేజ్ రాయల్ గెటప్‌లో భయపెట్టనున్నారు. ఇలా స్టార్ హీరోలంతా తమ అభిమానులకు డబుల్ జోష్ ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment