డ్రైవర్ రాయుడు (Driver Rayudu) హత్య కేసు (Murder Case)లో విచారణ కీలక దశకు చేరింది. ఈ కేసులో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే (Srikalahasti TDP MLA) బొజ్జల సుధీర్ రెడ్డికి (Bojjala Sudheer Reddy) సమన్లు జారీకి సిద్ధమయ్యాయి. మరికొన్ని గంటల్లోనే చెన్నై పోలీసులు ఎమ్మెల్యే బొజ్జలకు సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంతో శ్రీకాళహస్తి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హత్య కేసు వెనుక ఎమ్మెల్యే బొజ్జల ఉన్నాడని గతంలో జనసేన శ్రీకాళహస్తి మాజీ ఇన్‌చార్జ్ కోట వినుత (Kota Vinutha) దంపతులు పలు సందర్భాల్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే.
కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై సెవెన్ వెల్స్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తికి చెందిన కూటమి నేతలకు సమన్లు (Summons) జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డిని చెన్నై పోలీసులు విచారించినట్లు తెలిసింది. కేసులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయన పాత్రపై స్పష్టత రావాల్సి ఉండటంతో చెన్నై పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ విచారణ రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ హత్య కేసులో జనసేన మాజీ ఇన్‌చార్జి కోట వినుత ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారింది. డ్రైవర్ రాయుడు హత్యలో టీడీపీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి జనసేన కార్యకర్తలు కుమ్మక్కయ్యారని కోట వినుత ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆమె వాంగ్మూలం ఆధారంగా జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవిలను పోలీసులు విచారించారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ అత్యంత కీలకంగా మారనుంది. ఇప్పటికే నిన్న జనసేన కార్యకర్తలను చెన్నై పోలీసులు విచారించినట్లు సమాచారం.
మృతుడు రాయుడు మరణానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. ఆ వీడియోలో జనసేన కార్యకర్తలు పేట చంద్ర, పేట చిరంజీవి పేర్లు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆధారాలన్నీ విచారణ దిశను మార్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో డ్రైవర్ రాయుడు హత్య కేసు మరింత సంచలనంగా మారుతోంది. రానున్న రోజుల్లో చెన్నై పోలీసులు చేపట్టే విచారణ, సమన్ల జారీతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.








