అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం దిగుమతుల (Steel, Aluminum Imports)పై 25% సుంకం (US Tariffs) విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కెనడా, మెక్సికో సహా అనేక దేశాలను ప్రభావితం చేయనుంది. “మన దేశ ఉత్పత్తులపై ఇతర దేశాలు భారీ సుంకాలు విధిస్తుంటే, మనం మాత్రం ఖాళీగా ఉండలేం” అంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన అనంతరం స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
కెనడా 51వ రాష్ట్రంగా మారుతుందా?*
ట్రంప్ మరో ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా(Canada 51st State) మార్చాలనే తన ఉద్దేశాన్ని వెల్లడించారు. “కెనడాకు ఇచ్చే సబ్సిడీల కారణంగా అమెరికా భారీ నష్టం ఎదుర్కొంటోంది. ఇది ఇకపై కొనసాగించలేం” అని అన్నారు.
గాజా విషయంలో..
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై కూడా ట్రంప్ తన విధానాన్ని స్పష్టం చేశారు. గాజాను స్వాధీనం చేసుకోవడంపై ఆయన గట్టి పట్టుదలగా ఉన్నారని, అక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆర్థిక, వాణిజ్య రంగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.