ఏజెంట్ల ద్వారా పిల్ల‌ల కొనుగోలు.. నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలనం

ఏజెంట్ల ద్వారా పిల్ల‌ల కొనుగోలు.. నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌లో సంచలనం

సృష్టి (Srishti) టెస్ట్ ట్యూబ్ బేబీసెంట‌ర్ (Test Tube Baby) పేరుతో డాక్ట‌ర్ న‌మ్ర‌త అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డింది. అక్రమ సరోగసి రాకెట్‌ (Surrogacy Racket)లో ప్రధాన నిందితురాలిగా నిలిచిన డాక్టర్‌ నమ్రత (Namrata) తన విచారణలో విస్తుపోయే నిజాలు వెల్ల‌డించారు. నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్‌(Report)లోని అంశాలు సంచలనంగా మారాయి. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసిన విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు. సరోగసి పేరుతో పిల్లలు లేని దంపతుల దగ్గర నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్టు అంగీకరించారు.

నమ్రత తన స్టేట్‌మెంట్‌లో, అబార్షన్‌ కోసం వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపి, వారిని మోసం చేసామని పేర్కొన్నారు. ప్రసవం అనంతరం పుట్టిన శిశువులను కొనుగోలు చేసి, సరోగసి ద్వారానే ఆ పిల్లలు పుట్టినట్టుగా దంపతులను నమ్మించామని తెలిపారు. ఈ విధంగా ఎంతోమంది కుటుంబాలను మోసం చేసినట్లు ఆమె ఒప్పుకున్నారు.

పిల్లల కొనుగోలు వ్యవహారంలో సంజయ్, సంతోషి కీలకపాత్ర పోషించారని నమ్రత వెల్లడించారు. అంతేకాకుండా, తన రెండో కుమారుడు లీగల్‌ వ్యవహారాల్లో సహకరించేవాడని కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు బయటపడటం తో వైద్యరంగంలో కలకలం రేగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment