దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ

దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పడిపోయిన గాలి నాణ్యత!

హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా నగరంలో టపాసులు పెద్ద ఎత్తున కాల్చడం వలన నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది. కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం, గాలిలో కాలుష్య స్థాయిలు ఈ విధంగా నమోదయ్యాయి.

సనత్‌నగర్: అత్యధికంగా PM 10 స్థాయి 153 µg/m³ (మైక్రోగ్రామ్‌ పర్ క్యూబిక్ మీటర్) గా నమోదైంది.

న్యూ మలక్‌పేట: 164 µg/m³

కాప్రా: 140 µg/m³

కోకాపేట: 134 µg/m³

సోమాజిగూడ: 122 µg/m³

రామచంద్రాపురం: 122 µg/m³

కొంపల్లి: 120 µg/m³

ఢిల్లీలో డేంజర్ బెల్స్: AQI 350కి చేరిక

ఇదిలా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీపావళి పండుగ కారణంగా ఢిల్లీ వాతావరణం పూర్తిగా కలుషితమైంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కాలుష్యం మరింత పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 350 వద్ద నమోదైంది.

ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి, సుప్రీంకోర్టు ఢిల్లీలో ‘గ్రీన్ క్రాకర్స్’ మాత్రమే కాల్చుకునేందుకు అనుమతి ఇచ్చి, సమయాన్ని కూడా కేటాయించింది. అయితే, గ్రీన్ క్రాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున సాధారణ మందుగుండు సామాగ్రి కాల్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది, పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది. దీనికి కారణం రాకెట్లు, ఇతర బాణాసంచా విపరీతంగా కాల్చడమేనని నిపుణులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment