దురదృష్టవశాత్తు పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించిన ఓ దివ్యాంగురాలకు ఏపీ ప్రభుత్వం (AP Government) పెన్షన్ (Pension) తొలగించింది. రీ వెరిఫికేషన్ (Re-Verification) పేరుతో తన పెన్షన్ తొలగించారనే మనస్తాపంతో 53 ఏళ్ల దివ్యాంగురాలు (Disabled Woman) గుండెపోటు (Heart Attack)తో మరణించిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మొవ్వ మండలం పెదపూడి సచివాలయం పరిధికి చెందిన మేడం లక్ష్మి (Medam Lakshmi) (53) పుట్టుకతోనే అవయవ లోపాలతో దివ్యాంగురాలిగా జీవనం సాగిస్తోంది. జీవనాధారం కోసం ఆమెకు ప్రభుత్వం అందిస్తున్న దివ్యాంగుల పెన్షన్ మాత్రమే ఆధారంగా ఉండేది. అయితే ఇటీవల పెన్షన్ల సర్వే సందర్భంగా లక్ష్మి పెన్షన్ తొలగించారు. దీంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పెన్షన్ రిజెక్షన్ లేఖ అందుకున్న సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోదరుడికి ఈ విషయాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ ఫోన్ ద్వారా తెలియజేయగా, కొద్ది గంటల వ్యవధిలోనే లక్ష్మి గుండెపోటుతో మృతిచెందారు.
సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ వివరాల ప్రకారం, వారి పరిధిలోని 113 మంది పెన్షనర్లలో రీ-వెరిఫికేషన్ నిర్వహించగా 34 మందిని రిజెక్ట్ చేశారని, 8 మంది పక్షవాతం బాధితుల పెన్షన్‌ను రూ.6 వేల పెన్షన్ కింద మార్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మి మృతి స్థానికంగా తీవ్ర విచారం కలిగించింది.