మోస‌పోయిన మోనాలిసా.. డైరెక్ట‌ర్‌ అరెస్టు

మోస‌పోయిన మోనాలిసా.. డైరెక్ట‌ర్‌ అరెస్టు

బాలీవుడ్‌ (Bollywood) లో మరో వివాదాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. దర్శకుడు సనోజ్ మిశ్రా (Sanoj Mishra) పై ఓ యువతి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ (Arrested) చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, 2020లో టిక్ టాక్ (TikTok), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా సనోజ్ మిశ్రాతో పరిచయం ఏర్పడింది. 2021 జూన్ 17న సనోజ్ ఆమెను ఝాన్సీ రైల్వే స్టేషన్‌ (Jhansi railway station) దగ్గరకు రావాలని కోరాడు. తిరస్కరించడంతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. భయంతో అతడిని కలిసిన బాధితురాలిని ఓ రిసార్ట్‌కి తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.

బెదిరింపులు, మోసపూరిత ప్రవర్తన
ఈ ఘటనను బయటపెడితే వీడియోలు (videos) లీక్ చేస్తానని బెదిరించిన సనోజ్, పెళ్లి చేస్తానని మోసగించి పలుమార్లు లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. చివరకు, నబీ కరీమ్ (Nabi Karim) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సినిమా అవకాశాల పేరుతో మోసపోతున్న యువతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో మ‌హా కుంభ‌మేళా (Maha Kumbh Mela) ఫేమ్ మోనాలిసా (Monalisa) ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప‌లువురు నెటిజ‌న్లు సూచిస్తున్నారు. ఆ యువ‌తిలా డైరెక్ట‌ర్ మాట‌లు న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని ఉచిత స‌ల‌హాలు ఇస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment