ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి తన ట్వీట్స్‌తో హాట్ టాపిక్‌గా మారారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో అరెస్ట్ అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ RGV వీడియో ఒకటి షేర్ చేశారు. ఆ వీడియోకి RGV తనదైన శైలిలో క్యాప్షన్ జత చేశారు: “రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్టుల్లో కామన్ పాయింట్ ఏంటి?” దీనికి తనపైనే సమాధానం చెబుతూ, “వాళ్లిద్దరూ తమ బెడ్రూమ్‌లో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు” అని పేర్కొన్నారు.
What’s common between the HONOURABLE CHIEF MINISTER OF TELANGANA @revanth_anumula and INDIA’S BIGGEST STAR @alluarjun is , they both got ARRESTED FROM THEIR BEDROOMS 🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/bg7YJH1Qdl
— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2024
RGV చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో చర్చలకు దారితీసింది. కొందరు దీనిపై సరదాగా స్పందిస్తే, మరికొందరు RGVపై విమర్శలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రకంపనలు
RGV ట్వీట్ సాధారణమైనదే అయినా, దానిపై వచ్చిన రియాక్షన్లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అల్లు అర్జున్ అభిమానులు, రేవంత్ రెడ్డి అనుచరులు RGV వ్యాఖ్యలపై తమదైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గతంలో చంద్రబాబుపై, పవన్‌పై RGV విరుచుకుపడేవారు. తనదైన శైలిలో ట్వీట్‌లు పెడుతూ ఈ ఇద్దరు నేతలను ఇరకాటంలో పెట్టేవాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా RGV రెండు సినిమాలు సైతం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, RGV మాత్రం యధార్థ కథను సినిమా తీశానని సమర్థించుకున్నాడు. ఇటీవల RGVపై ఏపీలో పలు కేసులు కూడా నమోదయ్యాయి.