సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తాజాగా తన మూవీ ఈవెంట్లో బెట్టింగ్ యాప్స్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరు శారీ. యథార్థ ఘటన ఆధారంగా వస్తున్న ఈ మూవీలో ఆరాధ్య దేవి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫంక్షన్లో ఆర్జీవీ పాల్గొని మాట్లాడారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. “నాకు బెట్టింగ్ యాప్స్ గురించి ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను అటువంటి యాడ్లలో నటించలేదు. ఒకవేళ ప్రమోట్ చేయాల్సి వస్తే, వోడ్కానే చేస్తా.. కానీ బెట్టింగ్ యాప్స్ కాదు” అని స్పష్టంగా చెప్పారు. అలాగే “ప్రభుత్వం ఈ యాప్స్ లీగలా కాదా అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి” అని కూడా సూచించారు. ఆర్జీవీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివాదాస్పద దర్శకుడి డేరింగ్ స్టేట్మెంట్కు లైక్స్ పడుతున్నాయి.