సామాజిక అంశాలే తన కథకు మూల ఆధారాలుగా మలుచుకునే ప్రముఖ దర్శకుడు దేవ కట్టా, త్వరలో ఓ వెబ్ సిరీస్ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YSR), విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య రాజకీయ పరిణామాలను, వారి అనుబంధాన్ని ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్, చంద్రబాబు తమ పొలిటికల్ కెరీర్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచే మొదలుపెట్టారు. యూత్ కాంగ్రెస్‌లో వీరిద్దరూ కీలక పాత్రలను పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. చంద్రబాబు మాత్రం టీడీపీలోకి ఆ పార్టీ నుంచి రాజకీయాలు మొదలుపెట్టారు. రాజకీయ అరంగేట్రంలో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ ఎలా ఉండేది, తరువాత పరిణామాలు ఎలా మారాయి అనే కోణంలో వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు దేవకట్టా. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ వెబ్ సిరీస్‌లో చంద్రబాబు పాత్రలో ఆది పినిశెట్టి, వైఎస్సార్ పాత్రలో చైతన్య రావు నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.