61 ఏళ్ల వయస్సులో బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు (Former President) పెళ్లిపీటలెక్కాడు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాహబంధంలోకి (Marriage) అడుగుపెట్టారు. శుక్రవారం సాయంత్రం ఆయన రింకు మజుందార్ (Rinku Majumdar) ను వివాహం చేసుకున్నారు. కోల్‌కతా (Kolkata) లోని న్యూటౌన్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగింది. ఈ వేడుకకు ఇద్దరి కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిలీప్ ఘోష్ కుర్తా-పైజామాలో మెరిశారు. వధువు రింకు మజుందార్ సంప్రదాయ ఎరుపు చీరలో అందంగా కనిపించారు.
మమతా బెనర్జీతో సహా పలువురు నేతల నుంచి శుభాకాంక్షలు
దిలీప్ ఘోష్ పెళ్లికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, రాజ్యసభ సభ్యుడు షమిక్ భట్టాచార్య, బీజేపీ జాతీయ నాయకులు సునీల్ బన్సాల్, మంగళ్ పాండే, మాజీ ఎంపీ లాకెట్ ఛటర్జీ తదితరులు ఘోష్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
తల్లి కోరిక మేరకే పెళ్లి నిర్ణయం: దిలీప్ ఘోష్
పెళ్లి అనంతరం దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, “నా తల్లి (Mother) కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను,” అని తెలిపారు. గతంలో ఆయన బ్రహ్మచర్య జీవితం గడిపారు. కానీ, రింకు మజుందార్‌కు ఇది రెండవ వివాహం కాగా, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.