టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన ఇంట్లో ఇన్‌కం ట్యాక్స్ (IT) శాఖ సోదాలు నిర్వహించగా, వ్యాపార లావాదేవీలకు సంబంధించి వివరణ ఇవ్వాలని అధికారుల నుంచి నోటీసులు అందినట్లు సమాచారం.
ఈ క్రమంలో బ్యాంక్ స్టేట్మెంట్లు, డాక్యుమెంట్లు సహా అవసరమైన వివరాలను దిల్ రాజు సమర్పించినట్లు తెలుస్తోంది. సినిమా నిర్మాణ వ్యయాలు, విడుదల అనంతర లాభాలు తదితర అంశాలపై అధికారులు వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సినీ వర్గాల్లో ఆసక్తి
తాను నిర్మాతగా వ్యవహరించిన సినిమాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి దిల్ రాజు స్వయంగా హాజరైనట్లు చెబుతున్నారు. అయితే, ఇది ఒక సాధారణ విచారణనా..? లేక దీని వెనుక మరేదైనా అంశముందా? అనే దానిపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.








