TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

TFDL చైర్మన్‌గా దిల్‌రాజు ప్రమాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ నిర్మాత దిల్ రాజు (వెలమకుచ వెంకటరమణారెడ్డి)కు కీలక పదవి అప్ప‌గించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్‌గా దిల్‌రాజు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న FDC కాంప్లెక్స్ కార్యాలయంలో దిల్ రాజు ఈ పదవిని స్వీకరించారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు.

ప్రమాణస్వీకారోత్సవంలో దిల్ రాజు మాట్లాడుతూ.. త‌న‌కు ఈ అవకాశాన్ని ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేస్తాన‌ని చెప్పారు. ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని దిల్ రాజు త‌న పుట్టినరోజు నాడు స్వీక‌రించ‌డం విశేషం.

భారీ ప్రాజెక్టులతో బిజీగా
ప్రస్తుతం దిల్ రాజు పలు భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణంలో ఉన్నారు. వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం, నితిన్‌, వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తమ్ముడు సినిమాలకు ఆయన నిర్మాతగా ఉన్నారు. అలాగే, గేమ్ ఛేంజర్ కూడా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment