---Advertisement---

దిల్ రాజు కీలక సమావేశం.. చిత్ర పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్తారా?

దిల్ రాజు కీలక సమావేశం.. చిత్ర పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్తారా?
---Advertisement---

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాతో భేటీ అయ్యారు. ఈ సమావేశం చిత్ర పరిశ్రమలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ప్రధానంగా థియేటర్ లైసెన్సుల పునరుద్ధరణను సులభతరం చేసే మార్గాలపై చర్చించామని తెలిసింది. అలాగే, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, తద్వారా చిత్ర పరిశ్రమకు నూతన శక్తి అందించడంపై దృష్టిపెట్టారు. ఈ సమావేశంలో దిల్ రాజుతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, పలువురు ఎగ్జిబిటర్లు కూడా పాల్గొన్నారు.

రాజకీయ వ్యాఖ్యలపై దిల్ రాజు స్పందన
ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ, అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు, చిత్ర పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శితో దిల్ రాజు సమావేశం కావడం ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ భేటీ ద్వారా పరిశ్రమకు లభించే ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment