---Advertisement---

నిర్మాతల‌ ఇళ్ల‌లో ముగిసిన ఐటీ సోదాలు.. కీల‌క ప‌త్రాలు స్వాధీనం

నిర్మాతల‌ ఇళ్ల‌లో ముగిసిన ఐటీ సోదాలు.. కీల‌క ప‌త్రాలు స్వాధీనం
---Advertisement---

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఇవాళ ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఈ సోదాలు మూడు రోజుల పాటు కొనసాగాయి. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతో పాటు, ఆయన సోదరుడు, కుమార్తె మరియు వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, మ్యాంగో మీడియా ప్రతినిధులు, పుష్ప-2 దర్శకుడు సుకుమార్, అనిల్ రావిపూడి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ దశలో మొత్తం 21 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. సోదాల సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇక ప్రముఖ ఫైనాన్సర్లు సత్య రంగయ్య, నెక్కింటి శ్రీధర్, నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇళ్లలోనూ తనిఖీలు జరిపారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుష్ప-2 మూవీ కలెక్షన్ల వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీ నిధుల గోల్‌మాల్ జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment