ధురంధర్ 2 ఎఫెక్ట్.. అడివి శేష్ ‘డెకాయిట్’ ఏప్రిల్‌కు షిఫ్ట్!

ధురంధర్ 2 ఎఫెక్ట్.. అడివి శేష్ ‘డెకాయిట్’ ఏప్రిల్‌కు షిఫ్ట్!

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ విడుదల విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మొదట గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్, ఆ తర్వాత సమ్మర్ స్పెషల్‌గా మార్చి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా వేస్తూ ఏప్రిల్ నెలకు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ మార్పుకు ప్రధాన కారణం బాక్సాఫీస్ వద్ద నెలకొన్న భారీ పోటీనే అని సమాచారం. మార్చి 19న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్ 2’ భారీ స్థాయిలో విడుదలవుతుండటంతో స్క్రీన్స్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కాబోతున్న ‘డెకాయిట్’కు నార్త్ మార్కెట్‌లో సరైన స్క్రీన్స్ దొరకడం కష్టమవుతుందనే అంచనాతో, సోలో రిలీజ్‌నే బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తూ ఏప్రిల్‌కు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న అడివి శేష్, ఈసారి కూడా గ్రిప్పింగ్ యాక్షన్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుండగా, సమ్మర్ సెలవుల అడ్వాంటేజ్‌తో ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment