జాలిరెడ్డి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైర‌ల్‌!

జాలిరెడ్డి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైర‌ల్‌!

‘పుష్ప’ సినిమాతో గుర్తింపు పొందిన ధనంజయ (జాలి రెడ్డి), ఇటీవల తన ప్రేయసి డాక్టర్ ధన్యతను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరి వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఓ సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

వివాహ సమయంలో ధనంజయ మూడు ముళ్లు వేసిన తర్వాత, పురోహితుడు ధన్యతను ఆశీర్వాదం తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ఆమె కాళ్లు మొక్కేందుకు ముందుకు రాగా, ధనంజయ వినయంగా నిరాకరించాడు. కానీ పెద్దల ఒత్తిడితో ధన్యత ధనంజయ కాళ్లు మొక్కగా, ధనంజయ వెంటనే ఆమె కాళ్లకు నమస్కరించాడు.

ఈ సంఘటనను చూసిన నెటిజన్లు ధనంజయ వినయాన్ని మెచ్చుకుంటున్నారు. కామెంట్ల‌తో ప్రశంసలు కురిపిస్తున్నారు. “ఇది నిజమైన గౌరవం! అలాంటి మనసున్నవాళ్లు అరుదు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ధనంజయ చేసిన పని ప‌లువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment