మొన్న ‘వెంట్రుక‌’.. ఇవాళ ‘మేకు’.. లోకేశ్ మాట‌కు విలువేది?

మొన్న వెంట్రుక‌.. ఇవాళ మేకు.. లోకేశ్ మాట‌కు విలువేది?

విజ‌య‌వాడ (Vijayawada) ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన శ్రీ‌క‌న‌క‌దుర్గ అమ్మ‌వారు (Sri Kanaka Durga Ammavaru) మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ అని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. భ‌క్తులు నిష్ట‌తో వ‌చ్చి కొండ‌పై కొలువైన అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. అమ్మ‌వారి ప్ర‌సాదం అంటే భ‌క్తుల‌కు చాలా ప్రీతి. అమ్మవారిని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో.. ఆ గుడిలో లడ్డూ (Laddu) ప్రసాదాన్ని స్వీక‌రిస్తే అంతే పుణ్యం అని న‌మ్ముతారు భ‌క్తులు. కానీ, ల‌డ్డూ ప్ర‌సాదంలో త‌యారీలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న ఘ‌ట‌నలు భ‌క్తుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తున్నాయి. మొన్న ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక (Hair)రాగా, నిన్న ఓ భ‌క్తుడు కొనుగోలు చేసిన ప్ర‌సాదంలో మేకు (Nail) రావ‌డం ఆగ్ర‌హానికి గురిచేసింది.

ఇటీవ‌ల దుర్గ‌మ్మ‌ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు
మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ ల‌డ్డూ త‌యారీలో ఏమాత్రం నాణ్య‌త పాటించ‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇటీవ‌ల ఫిబ్ర‌వ‌రి 8న‌ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ఓ భ‌క్తుడు ప్ర‌సాదంలో వెంట్రుక‌లు వ‌చ్చాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా వెంటనే వెంట్రుక ఉన్న లడ్డూ ప్రసాదాన్ని ఫొటోలు తీసి పోస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదంలో వెంట్రుక పడిన విషయాన్ని మంత్రులు నారా లోకేష్‌ (Nara Lokesh), ఆనం రామ‌నారాయ‌నరెడ్డి (Anam Ramanarayana Reddy) కి ట్యాగ్‌ చేస్తూ ఎక్స్‌(X) వేదికగా పోస్ట్‌ చేశారు.

మంత్రి మాట బేఖాత‌రు
అయితే ‘దుర్గమ్మ భక్తులందరికీ క్షమాపణలు (Apologized) చెప్పిన లోకేశ్.. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకుంటామ‌ని మాటిచ్చారు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన నెల వ్య‌వ‌ధిలోనే గ‌డ‌వ‌క‌ముందే ఏకంగా ప్ర‌సాదంలో మేకు రావ‌డంతో క‌న‌క‌దుర్గ‌మ్మ భ‌క్తులంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రి మాట‌కు కూడా విలువ లేకుండా పోయింద‌ని సోష‌ల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

పుణ్య‌క్షేత్రాల్లో అప‌చారాలు..
రాష్ట్రంలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో వ‌రుస‌గా ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కూట‌మి ప్ర‌భుత్వంపై స‌నాత‌న వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుప‌తిలో మాంసాహారాలు, మ‌ద్యం బాటిళ్లు, అన్నవ‌రం స‌త్రంలోని రూమ్‌ల‌లో బీరు సీసాలు, దుర్గ‌మ్మ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు, మేకు రావ‌డంతో హైంద‌వ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కులు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దేవాల‌య ప‌రిర‌క్ష‌ణ‌ను కూట‌మి ప్ర‌భుత్వం గాలికి వ‌దిలేసింద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment