యంగ్ టైగర్ NTR, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన దేవర చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీనికి సీక్వెల్‌గా వచ్చే దేవర-2 (Devara 2) భారీ అంచనాలతో నిర్మాణం జరుగుతుంది. ఈ భారీ చిత్రం ‘దేవర-2’ గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొరటాల శివ ఈ సినిమాను మరింత గ్రాండ్‌గా, విపరీతమైన యాక్షన్ సన్నివేశాలు (Action Movie), షాకింగ్ ట్విస్టులతో రూపొందించేందుకు ప్రత్యేకమైన స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు, ‘దేవర-2’ ను ‘పుష్ప-2’ (Pushpa 2) తరహాలో మాస్ ప్రేక్షకుల కోసం పూర్తి మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీపై అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, అధికారిక ప్రకటన త్వరలో రానుందని సమాచారం.








