స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు

స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు

దేశరాజధాని (National Capital) ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb Threats) ఆగడం లేదు. వరుసగా మూడో రోజు కూడా ఓ పాఠశాలకు (School) ఈ-మెయిల్‌ (Email)  ద్వారా బాంబు బెదిరింపు రావడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమైంది. బుధవారం సెయింట్ థామస్ స్కూల్ యాజమాన్యానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఈ-మెయిల్‌ ద్వారా “బాంబు పెట్టాం” అంటూ బెదిరింపులు పంపాడు. వెంటనే స్కూల్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌ రంగంలోకి
బెదిరింపు సమాచారం మేరకు పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌, అగ్నిమాపక శాఖ, ఎమర్జెన్సీ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర తనిఖీలు నిర్వహించాయి. త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఊహించిన ప్రమాదం తప్పటంతో అధికారులు, స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఇది ఒక్క రోజు ఘటన కాదు. సోమవారం ఢిల్లీలోని రెండు స్కూళ్లకు, మంగళవారం స్టీఫెన్స్ కాలేజీకి బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. ఇవన్నీ నకిలీ బెదిరింపులుగా తేలినా, తరచూ ఇవే తరహా ఘటనలు జరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా పలు ప్రముఖ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇలాగే ఫేక్ బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు ఇవన్నీ నిర్ధారణైనవి కాదన్నా, వాటిని తేలికగా తీసుకోకుండా అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

బెదిరింపులకు భద్రతా యంత్రాంగం సీరియస్‌
ఈ-మెయిల్స్ వెనక ఉన్న ముఠాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ టీం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment