ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కలకలం

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కలకలం

ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత కలిగించే సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)పై దాడి జరిగినట్లు భారతీయ జనతా పార్టీ (BJP) వర్గాలు ప్రకటించాయి. ఆమె అధికారిక నివాసంలో ‘జన్ సువాయ్’ (Jan Suvai) కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి రేఖా గుప్తాపై దాడి చేయడమే కాకుండా, ఆమెను దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడి చేసిన వ్యక్తి ఆమెను కొట్టాడని కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంకా బయటకు రాకపోయినా, పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తి 35 ఏళ్ల వాడని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment