దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వచ్చిన వరుస బాంబు బెదిరింపులు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. అయితే, ఈ బెదిరింపులకు సంబంధించి పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయం బయటపడింది. ఈ బెదిరింపుల వెనుక 12 ఏళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బాలుడు చేసిన ఈ పని కారణం తెలిసి అందరూ అవాక్కయ్యారు. గతంలో వచ్చిన బాంబు బెదిరింపులకు సంబంధించి నిందితులను పట్టుకోలేదనే అసంతృప్తితోనే ఈ బాలుడు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
కౌన్సెలింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం
పోలీసులు బాలుడితో పాటు అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై భవిష్యత్తులో విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి చర్యలు చేపట్టనున్నారు.