దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ (CEC) ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17 వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 5న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఈవీఎంలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. ఈవీఎంల ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని, ట్యాంపరింగ్ జరిగినట్లు ఇంతవరకు ఎక్కడా నిరూపణ కాలేదని ఆయన తెలిపారు. ట్యాంపరింగ్ చేయడం అసలు సాధ్యం కాదని చెప్పారు.
ఓటర్ లిస్ట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈవీఎంలను ఎవరూ ట్యాంపరింగ్ చేయలేరని స్పష్టం చేసింది. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని, మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటిందని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయని అన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఇదే తనకు చివరి ప్రెస్ మీట్ అని సీఈసీ చెప్పారు.