---Advertisement---

ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌పై గడ్కరీ వార్నింగ్‌

ఢిల్లీ ఎయిర్ పొల్యూష‌న్‌పై గడ్కరీ వార్నింగ్‌
---Advertisement---

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గాలి పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, అక్కడ గాలి మూడు రోజులు పీల్చినా చాలు అనారోగ్యం తప్పదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తీవ్ర హెచ్చరిక చేశారు. గాలి కాలుష్యానికి (Air Pollution) సంబంధించి ఢిల్లీ ఇప్పటికే రెడ్ జోన్‌ (Red Zone)లో ఉందని గడ్కరీ తెలిపారు. ఇలాగే కాలుష్యం కొనసాగితే ఢిల్లీ ప్రజల జీవిత కాలం (Life Span) కనీసం 10 సంవత్సరాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పరిష్కార మార్గాలు..
ఈ సమస్యకు పరిష్కారంగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ (Electric Vehicles) వినియోగాన్ని పెంచాలని, అలాగే గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen) వాహనాలను (Vehicles) ప్రోత్సహించాలన్న అవసరం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. వాతావరణం మెరుగుపడాలంటే శుద్ధ గాలి అందించే టెక్నాలజీలను వాడాలని కూడా సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment