భారత మహిళా క్రికెట్ జట్టు ప్రముఖ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ప్రదమైన పదవి కట్టబెట్టింది. దీప్తి శర్మను డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 27న యూపీ రాష్ట్రం మొరాదాబాద్ జిల్లాలో దీప్తికి డీఎస్పీ పదవిని అప్పగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆమె భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించింది. దీప్తి ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం టీమిండియా క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ పదవి ఇచ్చి గౌరవించిన విషయం తెలిసిందే. సిరాజ్ హైదరాబాద్ వాసి కావడం, భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో విశేషంగా రాణిస్తున్నందుకు గానూ ప్రభుత్వం సిరాజ్‌కు డీఎస్పీ పదవి ఇచ్చింది.