గత కొన్ని రోజులుగా దీపికా పదుకొణె (Deepika Padukone) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ప్రభాస్ (Prabhas) హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో మొదట హీరోయిన్‌గా దీపికాను ఎంపిక చేసినట్లు గుసగుసలు వినిపించాయి. అయితే, చివరి నిమిషంలో ట్రిప్టి డిమ్రిని (Triptii Dimri) తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సందీప్ రెడ్డి ఓ ట్వీట్‌లో సినిమా కథను లీక్ చేస్తున్నారని, ‘డర్టీ పీఆర్ గేమ్స్’ (‘Dirty PR Games’) ఆడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు దీపికాను ఉద్దేశించినవేనని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా, మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “జీవితంలో సమతుల్యత సాధించాలంటే నిజాయతీ కీలకం. నేను ఎప్పుడూ దానికే ప్రాముఖ్యత ఇస్తాను. క్లిష్ట పరిస్థితుల్లో నా మనస్సాక్షి చెప్పిన దాన్ని అనుసరిస్తా. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటా. ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటా” అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సందీప్ రెడ్డి వంగాకు పరోక్షంగా కౌంటర్ (Counter)గా ఉద్దేశించినవని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఈ వివాదాలను పక్కనబెడితే, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు, దీపికా ‘కల్కి 2’ సినిమా కోసం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ఆమెకు కుమార్తె జన్మించింది. ‘సింగం ఎగైన్’ చిత్రంలో ఆమె చివరిసారిగా కనిపించింది, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులను స్వీకరించలేదు.