పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) నుంచి ఊహించని వార్త ఒకటి బయటకొచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ దీపికా పడుకొణె (Deepika Padukone) ఇప్పుడు ప్రాజెక్ట్ (Project) నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. దీపికా వర్కింగ్ స్టైల్ (Working Style) టీమ్ (Team)కు సరిపడలేదట. షెడ్యూల్ ప్లానింగ్, షూటింగ్ కమిట్‌మెంట్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో మేకర్స్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం కొత్త హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టినట్లు ఫిలింనగర్‌లో చర్చలు సాగుతున్నాయి.
ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే అన్ని పాయింట్లపైనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.