21కి చేరిన వేట్లపాలెం మృతుల సంఖ్య.. ప్రముఖుల దిగ్భ్రాంతి

21కి చేరిన వేట్లపాలెం మృతుల సంఖ్య.. ప్రముఖుల దిగ్భ్రాంతి

కాకినాడ జిల్లా (Kakinada District) వేట్లపాలెంలో (Vetlapalem) జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 21కు చేరింది. సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ (Surya Sri Fire Works) పేరిట నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో (Firecrackers Manufacturing Unit) టపాసులు తయారు చేస్తుండగా భారీ పేలుడు (Massive Explosion) సంభవించింది. పేలుడుతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి చుట్టుపక్కల ప్రాంతం దద్దరిల్లిపోయింది. ప్రమాద స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోవడం, క్షతగాత్రుల హాహాకారాలతో భయానక వాతావరణం నెలకొంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళా కార్మికులే ఉన్నట్లు సమాచారం.

పెడపూడి రోడ్డులోని పొలాల్లో అడబాల వీరబాబు (Adabala Veerababu) కుటుంబసభ్యులు ఈ బాణసంచా పరిశ్రమను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పొలాల్లో ఆరు షెడ్లు ఏర్పాటు చేసి తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించారు. పేలుడుకు ముందు భోజనం కోసం బయటకు వెళ్లిన కొందరు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సీఎం స్పంద‌న‌
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు (Chandrababu Naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సూచించారు.

వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి
మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment