డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ లుక్ రిలీజ్‌

డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ లుక్ రిలీజ్‌

‘రాబిన్ హుడ్ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ నటిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. నితిన్, శ్రీలీల జంటగా వస్తున్న ఈ సినిమా మార్చి 28న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది.

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా, మైత్రీ మూవీ మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. “బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు భారత సినిమాకు స్వాగతం” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌తో పోస్టర్ విడుదల చేశారు. వార్న‌ర్ లుక్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment