భారత్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్‌ అక్కసు

భారత్‌పై ఇంగ్లాండ్ మాజీ అక్కసు

భారత్ (India) ఆధిపత్యం (Dominance) ప్రదర్శిస్తుందని అనిపించినప్పుడల్లా ఇంగ్లాండ్ (England) మాజీ క్రికెటర్లు (Former Cricketers) తమ అక్కసు (Frustration) వెళ్లగక్కేందుకు సిద్ధంగా ఉంటారు. గత ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) సమయంలో టీమ్ ఇండియా (Team India) ఒకే వేదికపై ఆడినందుకు, అదే విజేతగా నిలవడానికి కారణమంటూ ఇంగ్లాండ్ మాజీలు ఆక్షేపించారు. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు (587) చేయగా, ఇంగ్లాండ్ త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం వారికి కంటగింపుగా మారింది. దీంతో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ (David Lloyd) తన నోటికి పని చెప్పడం గమనార్హం. రెండో రోజు ఆటలో భారత ప్లేయర్లు తరచూ బ్రేక్‌లు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యానించాడు.

“కెప్టెన్ కావాలని ఉందా? జడేజా స్మైలీ రిప్లయ్ ఇదే!”
డేవిడ్ లాయిడ్ మాట్లాడుతూ, “రెండో రోజు ఆట ప్రారంభమైన 15 నిమిషాలకే జడేజా ఆటను ఆపాడు. డ్రింక్స్‌తోపాటు మాత్రలు వేసుకున్నాడు. మళ్లీ 40 నిమిషాల తర్వాత మరోసారి బ్రేక్ తీసుకున్నాడు. అక్కడ అంపైర్లు నిస్సహాయంగా నిలబడ్డారు. అందుకే, కొన్ని ఓవర్లు కోల్పోవడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. తప్పకుండా అధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. ఐసీసీ నుంచి మార్గదర్శకాలు రావాలి. ఏ బ్యాటరైనా గాయపడితే అతడికి బదులు మరొకరు క్రీజ్‌లోకి రావాలి. ఆట కొనసాగుతూనే ఉండాలి. అంతేకానీ, గడ్డి పెరిగిందని చూసేందుకు మా సహచరులు ఇక్కడికి 85 యూరోలు (దాదాపు 10 వేలు) పెట్టి రాలేదు” అని వ్యాఖ్యానించాడు.

“జడేజాలా నేనూ చేసేవాడిని..”
‘డేంజర్ జోన్’ వైపు వెళ్లడంపై ఇప్పటికే రవీంద్ర జడేజా స్పందించాడు. తాను అప్పుడు బౌలింగ్ చేయడం లేదని, తన దృష్టంతా బ్యాటింగ్‌పైనే ఉందని తెలిపాడు. అయినా సరే లాయిడ్ మాత్రం దానికి మరో అర్థం జోడించి వ్యాఖ్యానించడం గమనార్హం. “రవీంద్ర జడేజా ఉదయం చేసిన డ్రామా చూసేందుకు భలేగా అనిపించింది. భారత జట్టులో ఎంతో అనుభవమైన క్రికెటర్ అతడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ సమయంలో జడేజా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. జడేజా బ్యాటింగ్ చేసే సమయంలో ప్రతి బంతిని ఎదుర్కొన్న తర్వాత పిచ్‌పై బ్యాట్‌ను కొట్టాడు. తన పాదంతో రుద్దాడు. ఇది చాలా డ్రై పిచ్. మున్ముందు మ్యాచ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. వెల్‌డన్ రవి… నేను కూడా అలాగే చేసేవాడిని” అని లాయిడ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment