దానం నాగేందర్ కు నోటీసులు

దానం నాగేందర్ కు నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్ట్ తీవ్రంగా గమనించడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 30న ఉదయం స్పీకర్ కార్యాలయంలో దానం నాగేందర్ హాజరు కావాలని ఆదేశించగా, అలాగే ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కూడా నోటీసులు అందాయి. ఉదయం 10:30 గంటలకు బీఆర్ఎస్ ఫిర్యాదుపై, మధ్యాహ్నం 12:00 గంటలకు బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగనుంది.

దానం నాగేందర్ కేసు ఇతర ఎమ్మెల్యేల కంటే ప్రత్యేకత కలిగి ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బి-ఫామ్‌పై ఎంపీగా పోటీ చేశారు, ఇది స్పష్టమైన ఫిర్యాదు కిందకు వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు స్పీకర్ నిర్ణయం రాకముందే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశాలపై గళాలుమీద ప్రచారం విస్తరిస్తోంది. 30వ తేదీన జరగనున్న విచారణ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారి తీసే కీలక ఘట్టంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment