డిప్యూటీ సీఎం (Deputy CM) ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో(Pithapuram Constituency) మల్లాం (Mallam) గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ Dalits Social Boycott )ఘటనపై దళిత సంఘాల నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ స్పందించకపోవడమే కాకుండా, బాధితులను పరామర్శించకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం?” అని ప్రశ్నిస్తున్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయంపై మౌనంగా ఉండే నాయకుడికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదని, పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్పందించని పవన్ కళ్యాణ్
రిపబ్లికన్ పార్టీ (Republican Party) ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. దాసరి చెన్నకేశవులు (Dr. Dasari Chennakeshavulu), మాల ఉద్యోగుల సంఘం (Mala Employees Association) రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు (Ashok Babu) నాయకత్వంలో పిఠాపురం తాహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లాం గ్రామంలో దళితులపై జరిగిన సాంఘీక బహిష్కరణ భారత రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. కంప్యూటర్ యుగంలో ఈ తరహా ఘటనలు సిగ్గుచేటని మండిపడ్డారు. కుల వివక్షతోనే మల్లాం బాధితుల ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించలేదని ఆరోపించారు. కరెంటు షాక్‌తో మృతి చెందిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ (Pallapu Suresh) కుటుంబాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించలేదని గుర్తుచేశారు.
మల్లాం ఘటనపై సుప్రీం కోర్టుకు..
ఈ ఘటనపై సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్న దళిత నేతలు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌తో పాటు కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై చట్ట ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ న్యాయపరంగా పోరాటాన్ని కొనసాగించబోతున్నామని స్పష్టం చేశారు.








