‘డాకు మహారాజ్’ క్రేజీ అప్డేట్

జనవరి 5న 'డాకు మహారాజ్' థర్డ్ సింగిల్

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డాకు మహారాజ్’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. జనవరి 5న ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు మ్యూజిక్ ప్రియ‌లు, బాల‌య్య ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన పొందగా, మూడో సింగిల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

మూవీకి గ్లామర్ టచ్
బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా జనవరి 12న థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment