‘డాకు మహారాజ్’ ఫస్ట్ డే కలెక్షన్ల హంగామా

‘డాకు మహారాజ్’ ఫస్ట్ డే కలెక్షన్ల హంగామా

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ గ్రాండ్‌గా విడుదలై తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది. మూవీ మేక‌ర్స్ వివ‌రాల‌ ప్రకారం, ఈ మూవీ తొలి రోజునే రూ.56 కోట్లు వసూలు చేసింది. బాలకృష్ణ కెరీర్‌లో ఇదే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్‌ను నమోదు చేసిన సినిమా కావడం విశేషం. ‘డాకు మహారాజ్’ సినిమా అభిమానులను మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల మనసు కూడా గెలుచుకుంది. పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ కథ, బాలయ్య నటన సినిమాకు ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. సినిమా టీమ్ ఈ హిట్‌ను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తోంది. ఈ చిత్ర విజయంతో బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిని సాధించారు. రాబోయే రోజుల్లో ‘డాకు మహారాజ్’ వసూళ్లు ఇంకా ఎంత వరకు చేరుతాయో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment