‘మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు

'మెంథా' తుఫాన్ ఎఫెక్ట్.. భారీగా రైళ్ల రద్దు..

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో, భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తూర్పు కోస్టల్ రైల్వే (ECoR) మరియు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, హై అలర్ట్ ప్రకటించారు.

రైళ్ల రద్దు, ఈస్ట్‌కోస్ట్ చర్యలు: తూర్పు కోస్టల్ రైల్వే జోన్ పరిధిలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ముఖ్యంగా విశాఖ మీదగా ప్రయాణించే 43 రైళ్లను రద్దు చేశారు. రద్దు చేసిన రైళ్ల వివరాలు అక్టోబర్ 27, 28, 29 తేదీలకు సంబంధించినవిగా ఉన్నాయి. రైల్వే వంతెనలు, పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిరంతర నిఘా ఉంచాలని, అత్యవసర సేవల కోసం ప్రత్యేక బృందాలు, డీజిల్ లోకోమోటివ్‌లను సిద్ధం చేయాలని ECoR ఆదేశించింది. విశాఖపట్నం, విజయనగరం వంటి స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు.

దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు: మరోవైపు, సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ (Sanjay Kumar) శ్రీవాస్తవ విజయవాడ డివిజన్ అధికారులతో సమావేశమై, ప్రయాణికుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ట్రాక్‌లు, బ్రిడ్జిలపై నిరంతరం పెట్రోలింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ రైళ్ల రాకపోకలపై నిర్ణయం తీసుకోవాలని SCR అధికారులు ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment