సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) మోసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజుకో కొత్త ఎత్తుగడతో అమాయకుల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా విద్యుత్ (Electricity) వినియోగదారులను టార్గెట్ చేశారు కేటుగాళ్లు. ‘కరెంట్ బిల్ పెండింగ్ (Current Bill Pending)’ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ‘బిల్ కట్టకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా (Electricity Supply) నిలిపివేస్తాం’ అంటూ ఫేక్ మెస్సేజ్(Fake Message) లు పంపించి గుడ్డిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అపరిచిత నంబర్ల నుంచి మెస్సేజ్‌లు పంపించి నేరాలకు పాల్పడుతున్నారు.
8967954941 వంటి నంబర్ల నుంచి WhatsApp మెస్సేజ్‌లు పంపిస్తున్నారు. ‘మీ కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈరోజు రాత్రి 7:30 లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ సరఫరా నిలిపివేస్తాం’ అంటూ భయపెడుతున్నారు. ‘పవర్ కట్ చేయొద్దంటే 8135967194 నంబర్‌కు కాల్ చేయండి’ అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. లింక్ క్లిక్ చేస్తే.. అకౌంట్ (Account) లోని మొత్తం సొమ్ము గల్లంతవుతోంది!
- మెస్సేజ్‌లకు ఎలా స్పందించాలి?
- అధికారిక వెబ్‌సైట్ (Official Website) ద్వారా మాత్రమే బిల్ చెల్లించండి
- లింకులు క్లిక్ చేయకండి – విద్యుత్ సంస్థలు ఎప్పుడూ లింక్ పంపవు
- అసలైన సమాచారం కోసం డిస్కమ్ (DISCOM) వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ (Toll-Free Number)ను ఉపయోగించండి
- సందేహం వస్తే గూగుల్ సెర్చ్ చేయండి – విద్యుత్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ద్వారా డిటైల్ చెక్ చేయండి
- అనుమానాస్పద మెస్సేజ్‌లను తక్షణమే డిలీట్ చేయండి
- పోలీసులకు ఫిర్యాదు చేయండి – సైబర్ క్రైమ్ నంబర్ 1930 లేదా Cyber Crime Portal ద్వారా కంప్లైంట్ నమోదు చేయండి








