అనంతలో అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్

అనంతలో అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్

అనంతపురం (Anantapur)లో ఓ అంతర్జాతీయ (International) స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ క్రైమ్ ముఠా (Cyber Crime)ను పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్(Arrest) చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ ముఠా కంబోడియా (Cambodia) దేశం నుంచి నిర్వహించే ఫేక్ యాప్‌ల (Fake Apps) ద్వారా ప్రజలను మోసగించి డబ్బు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భారతీయుల (Indians’) బ్యాంక్ ఖాతాలను (Bank Accounts) టార్గెట్ చేస్తూ, నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించడంతో పాటు, వాటిలో వ్యక్తిగత వివరాలు నమోదు చేయించేవారిని మోసగించి డబ్బు దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో రూ.41 లక్షల నగదు, భారీగా డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ రౌటర్లు సహా పలు ఆధారాలు పోలీసులకు చిక్కాయి. అనంతపురం ఎస్పీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ముఠా వేల మంది నుంచి డబ్బు వసూలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బాధితుల సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment