చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మేసీన్ కనిపించింది. కస్టమ్స్ తనిఖీల్లో భారీగా డ్రగ్స్, గంజాయి, బంగారం సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 14.2 కోట్ల విలువైన కొకైన్, 76 లక్షల విలువైన విదేశీ గంజాయి, అలాగే 1.75 కోట్ల విలువైన 1.78 కిలోల బంగారం పట్టుబడింది.
డ్రగ్స్ ఎక్కడ దాచారు?
కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. కొకైన్‌ను ఒక కెన్యా మహిళ క్యాప్సూల్స్‌లో నింపి తన పొట్టలో దాచింది. అదికూడా ఏకంగా 76 క్యాప్సూల్స్ మింగింది కెన్యా మహిళ. వాటిని అధికారులు గుర్తించడంతో శస్త్రచికిత్స చేసిన అనంతరం పొట్టలో దాచిన కొకైన్ ను వైద్యులు బయటకు తీశారు. ఆ తర్వాత ఇథియోపియా నుండి చెన్నై వచ్చిన ఆ కెన్యా మహిళపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసారు అధికారులు.
బ్యాంకాక్ ప్రయాణీకుడి బ్యాగ్‌లో విదేశీ గంజాయిని గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దీంతో ఆ ప్రయాణీకుడిపై NDPS యాక్ట్ కింద కేసు చేసారు. ఇక దుబాయ్ నుండి చెన్నై చేరుకున్న ప్రయాణీకుడు బంగారాన్ని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ ద్వారా స్మగ్లింగ్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగా.. కస్టమ్స్ అధికారుల చేతికి దొరికిపోయాడు.








