భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెటర్లు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ గురించి ఒక్క మాటలో వివరణ ఇవ్వాలని క్రికెటర్లను యాంకర్ అడిగారు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు “సూపర్ స్టార్”, “లెజెండ్”, “క్లాసీ” అంటూ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. అయితే, ప్యాట్ కమిన్స్ మాత్రం సింపుల్‌గా “బ్యాటర్” అని సమాధానమిచ్చాడు. ఈ వ్యాఖ్య టీమిండియా అభిమానులకు నచ్చలేదు. కోహ్లీ స్థాయిని నిర్లక్ష్యం చేసినట్టు భావించి కమిన్స్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.
భారత అభిమానుల ప్రతిస్పందన
సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ అభిమానులు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. కమిన్స్ మిగతా క్రికెటర్ల మాదిరిగా కోహ్లీ ప్రతిభకు గౌరవం ఇవ్వలేదని అంటున్నారు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాన్ని సింపుల్‌గా “బ్యాటర్” అని పిలవడం ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినట్లేనని కామెంట్లు చేస్తున్నారు.








