CSK తలరాతను ధోని మార్చగలడా? టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న KKR

చెన్నై వేదిక (Chennai Venue) గా ఈరోజు ఐపీఎల్ (IPL) హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఎంఎస్ ధోని (M.S. Dhoni) సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది. ఈ మ్యాచ్ ధోనికి అత్యంత కీలకం. ఇప్పటి వరకు సీజన్‌లో చెన్నై ప్రదర్శన తేలిపోవడంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. గత ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక్కదానిలో విజయం సాధించడమే ఇందుకు కారణం. మరోవైపు కోల్‌కతా పరిస్థితి కొంత మెరుగ్గా ఉందట. ఐదు మ్యాచుల్లో రెండు గెలవగా, మూడింటిలో పరాజయం ఎదురైంది. ప్రస్తుతం KKR పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

ఈరోజు టాస్ (Toss) గెలిచిన కోల్‌కతా బౌలింగ్ (Bowling) ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కి దిగనుంది. ఇద్దరు జట్లూ తమ బెస్ట్ ప్లేయింగ్‌ XIతో బరిలోకి దిగాయి. ఇంపాక్ట్ ప్లేయర్లతో మ్యాచు మలుపు తిరిగే అవకాశం ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ XI:
డెవోన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎం.ఎస్. ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, నూర్ అహ్మద్, అంషుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్

ఇంపాక్ట్ ప్లేయర్స్
మతీష పథిరాన, కమలేష్ నాగర్‌కోటి, షేక్ రషీద్, జేమీ ఓవర్టన్, దీపక్ హూడా

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సునిల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రే రసెల్, రామందీప్ సింగ్, మొయిన్ అలీ, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ ప్లేయర్స్
అంకృష్ రఘువంశీ, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, రోవ్‌మాన్ పోవెల్, లవ్నిత్ సిసోడియా

Join WhatsApp

Join Now

Leave a Comment