CSK టీమ్ ను నిద్రలేపండి.. అభిమానుల ఆగ్రహం

ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటతీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ (DC) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు (Disappointment) గురయ్యారు.

స్టేడియం (Stadium) బయట మాట్లాడిన కొంతమంది అభిమానులు, “మేం టీ20 మ్యాచ్ కోసం వచ్చాం. కానీ చెన్నై బ్యాటింగ్ మాత్రం వన్డే కంటే దారుణంగా టెస్ట్ మ్యాచ్‌ (Test match) లా ఉంది. DC ఆక్టివ్‌గా ఆడింది. కానీ చెన్నై బ్యాటింగ్ చాలా బలహీనంగా అనిపించింది. బౌలింగ్ బాగుంది కానీ పవర్ హిట్టర్స్ (Power Hitters) లేరు. హిట్టింగ్‌కు సరైన ప్లేయర్లు కనిపించడం లేదు,” అంటూ స్పందించారు.

జట్టు పేలవ ప్రదర్శనపై అభిమానులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే మ్యాచుల్లో అయినా జట్టు గేర్ మార్చి బలమైన ప్రదర్శన ఇస్తుందని ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment