కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ స‌క్సెస్‌

కర్రెగుట్టలపై బేస్ క్యాంప్.. సీఆర్పీఎఫ్ ఆపరేషన్ స‌క్సెస్‌

తెలంగాణ‌- ఛత్తీస్‌గఢ్ (Telangana-Chhattisgarh) సరిహద్దులలో విస్తరించిన కర్రెగుట్టలపై (Karregutta)సీఆర్పీఎఫ్ (CRPF) నిర్వహించిన భారీ భద్రతా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్ 9 రోజుల పాటు కొనసాగింది. మావోయిస్టుల (Maoists) చొరబాట్లను అడ్డుకునేందుకు సీఆర్పీఎఫ్ ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. డ్రోన్లు (Drones), హెలికాప్టర్ల (Helicopters) సహాయంతో అడవిలో క్లిష్టమైన ప్రదేశాలను గుర్తించి, సమర్థవంతంగా భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) చీఫ్ కర్రెగుట్ట ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ CRPF అధికారులు ఆయనకు ఆపరేషన్ విజయవంతమైన విధానాల‌ను వెల్లడించారు.

సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు మావోయిస్టుల డంపులు(Maoist Dumps), సొరంగాలను (Tunnels) గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేయడంలో వారు విజయవంతమయ్యారు, తద్వారా మావోయిస్టుల చొరబాట్లపై అడ్డుకట్ట వేసింది. ఆప‌రేష‌న్ విజయంతో, కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ (Base Camp) ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్యాంప్ ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ ప్రాంతాలకు సులభంగా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయనుంది. భవిష్యత్తులో కూడా మావోయిస్టుల కదలికలపై గట్టి పట్టు సాధించేందుకు ఇది కీలకమైన అడుగుగా సైన్యం భావిస్తోంది.

కొత్త బృందం రంగంలోకి..
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మొదటి బృందాన్ని వెనక్కి పంపించి, కొత్త బృందాన్ని రంగంలోకి దింపారు. దీని ద్వారా భద్రతా చర్యలు మరింత బలపడే అవకాశం ఉంది. ఈ చర్యలు సమగ్ర రక్షణను కాపాడుకునేందుకు తీసుకోవలసిన కీలకమైన అడుగులుగా అధికారులు పేర్కొనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment