రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాళ్‌పై మరో కేసు నమోదైంది. క్రికెట్‌లో అద్భుత కెరీర్ చూపిస్తానని నమ్మించి, రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన ఓ యువతి ఆరోపణలు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు జైపూర్ పోలీసులు యశ్ దయాళ్‌పై పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు. ఇటీవల ఘజియాబాద్‌కు చెందిన ఒక అమ్మాయి కూడా ఆర్‌సీబీ ఆటగాడిపై ఫిర్యాదు చేసింది. వివాహం పేరుతో యశ్ తనను లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపించింది.
ఫిర్యాదులో జైపూర్ యువతి వెల్లడించిన వివరాలు:
“ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జైపూర్‌లో తొలిసారి యశ్ దయాళ్‌ను కలిశా. క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుదామని సీతాపురలోని ఓ హోటల్‌కు నన్ను పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తూ.. రెండేళ్ల పాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. మంచి క్రికెట్ కెరీర్ చూపిస్తానంటూ యశ్ నన్ను మోసం చేశాడు” అని జైపూర్ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
మొదటిసారి అత్యాచారానికి గురైనప్పుడు ఆమె మైనర్. అమ్మాయి వయసు 17 ఏళ్లు కావడంతో, పోక్సో చట్టం కింద దయాళ్‌పై జైపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గాజియాబాద్ యువతి కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, అతని అరెస్టుపై స్టే విధించిన విషయం తెలిసిందే.
యశ్ దయాళ్ క్రికెట్ కెరీర్:
యశ్ దయాళ్ ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు. 2024 నుండి ఆర్‌సీబీలో భాగంగా ఉన్నాడు. ఆర్‌సీబీ ఐపీఎల్ 2025లో టైటిల్‌ను గెలవడంలో యశ్ ముఖ్యపాత్ర పోషించాడు. 13 వికెట్లు పడగొట్టి జట్టుకు తన సహకారం అందించాడు. అతడికి ఇది రెండో ఐపీఎల్ టైటిల్. 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచిన జట్టులో యశ్ సభ్యుడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అతడు 41 వికెట్లు పడగొట్టాడు.