సీఆర్డీఏ మీటింగ్‌.. క్వాంటం టెక్నాల‌జీకి టెండ‌ర్లు

సీఆర్డీఏ మీటింగ్‌.. క్వాంటం టెక్నాల‌జీకి టెండ‌ర్లు

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అధ్యక్షతన 56వ సీఆర్డీఏ (CRDA) అథారిటీ సమావేశం (56th CRDA Authority Meeting) జరిగింది. అమరావతి రాజధాని (Amaravati Capital) అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

అమరావతిలో క్వాంటం టెక్నాలజీ హబ్‌గా (Quantum Technology Hub) రూపుదిద్దుకునే దిశగా చేపట్టనున్న క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి టెండర్లు (Tenders) పిలిచే అంశంపై అథారిటీ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిని ఆధునిక సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే రాజధానిలోని అఖిలభారత సర్వీసు (AIS) అధికారుల నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల వద్ద చేపట్టనున్న అదనపు నిర్మాణాలుపై అథారిటీ సమీక్ష చేపట్టింది. అవసరమైన సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై అధికారులు వివరించారు.

ఏపీసీఆర్డీఏ (APCRDA), అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADCL) పాలనా వ్యయాల మంజూరు అంశాన్ని కూడా సమావేశంలో పరిశీలించారు. సంస్థల నిర్వహణ, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులపై అథారిటీ నిర్ణయం తీసుకుంది.

రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన యోగా, నేచురోపతి సెంటర్ నిర్మాణం, అలాగే పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై సీఆర్డీఏ అథారిటీ సమీక్ష జరిపింది. ఈ ప్రాజెక్టులు అమరావతికి ఆరోగ్య, వెల్‌నెస్ హబ్‌గా గుర్తింపు తెస్తాయని అధికారులు పేర్కొన్నారు.

అమరావతిలోని పంపింగ్ స్టేషన్లు, జోన్–8లో ఎల్పీఎస్ (LPS) పనులుపై చర్చించి ఆమోదం తెలిపారు. నీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధిలో ఇవి కీలకమైన అంశాలుగా అధికారులు వివరించారు.

ఇక జరీబు – మెట్ట భూముల వర్గీకరణపై రాష్ట్ర స్థాయి కమిటీ నియామకానికి సంబంధించి అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణలో స్పష్టత తీసుకురావడం ద్వారా భవిష్యత్ అభివృద్ధి పనులకు దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment