ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి.. – సీపీఎం డిమాండ్

ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలి.. - సీపీఎం డిమాండ్

మావోయిస్టుల (Maoists) ఎన్‌కౌంటర్ల (Encounters) పేరుతో జరుగుతున్న అన్యాయ చర్యలను ఖండిస్తూ సీపీఎం (CPM) రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంపై తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. ఇటీవల మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్లు భూటకపు కావచ్చన్న అనుమానాలను సీరియస్‌గా తీసుకోవాలని, ఘటనలపై న్యాయ విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ డిమాండ్ చేసింది.

సీపీఎం ఆరోప‌ణ‌ల‌ ప్రకారం.. ముందుగానే మావోయిస్టులను నిర్బంధించి, అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అనుచితంగా ఎన్‌కౌంటర్లకు పాల్పడ్డారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయని, చట్టవ్యతిరేకంగా అమాయకులను హతమార్చే చర్యలను ప్రజాస్వామ్య విరుద్ధమని పార్టీ తీవ్రంగా ఖండించింది.

ఇక ఇటీవల విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి 50 మందికి పైగా మావోయిస్టులు, వారి అనుయాయులను నిర్బంధించిన విషయం గుర్తుచేసిన సీపీఎం, వారిని వెంటనే సంబంధిత కోర్టుల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేసింది. న్యాయస్థాన పర్యవేక్షణ లేకుండా నిర్బంధం కొనసాగించడం అసమ్మతికరమని సీపీఎం పార్టీ పేర్కొంది.

అదే సమయంలో, అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహాయం చేస్తున్నారన్న పేరిట పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నారన్న వార్తలపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దోషులను మిలిషియా సభ్యులుగా ముద్ర వేయడం, హింసాత్మక విచారణలు నిర్వహించడం తక్షణం ఆపాలని పార్టీ డిమాండ్ చేసింది. ప్రజల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, ఇలాంటి దుర్వినియోగాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment