చిన్న సినిమాగా విడుదలై.. బ్లాక్బస్టర్ హిట్ కొట్టి సినిమా ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ (Court: State vs Nobody)’ శుక్రవారం (Friday) నుండి ఓటీటీ (OTT)లో స్ట్రీమింగ్ కాబోతుంది. రామ్ జగదీశ్ (Ram Jagadeesh) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, రోహిణి, ప్రియదర్శి, హర్ష్ రోషణ్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయి కుమార్, సుధాకర్ లాంటి టాలెంటెడ్ నటులు నటించారు.
ఈ సినిమాని ప్రముఖ నటుడు నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మించాడంటే అర్థం చేసుకోవచ్చు, కథలో ఉన్న బలాన్ని. న్యాయవ్యవస్థ, సామాజిక అంశాలపై ప్రశ్నలు వేస్తూ.. గంభీరమైన అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో అన్నిరకాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన ఈ సినిమాకు ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.