విశాఖపట్నం తెలుగుదేశం పార్టీలో వింత పరిస్థితి తలెత్తింది.కార్పొరేటర్ల ఫిరాయింపును ప్రోత్సహించే అంశంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కొరవడింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లను తమవైపునకు లాక్కునే అంశంలో విశాఖ టీడీపీ నేతల మధ్య వివాదం తలెత్తింది. చేరికల విషయంలో మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, ఎంపీ శ్రీభరత్, టీడీపీ నేత గండి బాబ్జి వర్గీయుల మధ్య అభ్యంతరాలు తలెత్తాయి.
ప్రస్తుతం జగన్ పార్టీ ఆధీనంలో ఉన్న గ్రేటర్ విశాఖ మేయర్ స్థానాన్ని తమవైపునకు తిప్పుకోవాలని టీడీపీ ప్లాన్ చేసింది. ఇందుకు వైసీపీ నుంచి కార్పొరేటర్లను చేర్చుకోవాలన్న వ్యూహాన్ని పన్నింది. కానీ, మేయర్ మార్పు సమాచారం తమకు అందలేదని ఎంపీ శ్రీభరత్ వర్గం ఆరోపిస్తోంది. ఈ అంశంపై సాయంత్రం మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. 8మంది వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు ముహూర్తం ఫిక్స్ చేశారు. కాగా, ఈ అంశంపై అధికార టీడీపీలోని శ్రీభరత్, గండి బాబ్జి వర్గాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తోంది.
బలం లేకపోయినప్పటికీ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ స్థానాన్ని లాక్కోవాలని ప్లాన్ చేశారు. ఇందుకు వైసీపీ నుంచి కార్పొరేటర్లను లాక్కొని మేయర్‌పై అవిశ్వాసం పెట్టాలనుకున్నారు. తొమ్మిది మంది కార్పొరేటర్లను టీడీపీ, జనసేన పార్టీల్లో చేర్చుకోవాలనుకోగా, వర్గపోరుతో టీడీపీ ఫిరాయింపు రాజకీయం వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.