రికార్డులు బద్దలు కొడుతున్న ‘కానిస్టేబుల్ కనకం’

రికార్డులు బద్దలు కొడుతున్న ‘కానిస్టేబుల్ కనకం’

ఓటీటీలో సస్పెన్స్, థ్రిల్, ఎమోషన్ కలగలిపిన కంటెంట్‌కి ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తాజాగా అదే తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’ (Constable Kanakam). వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ కుమార్ (Prashanth Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ ETV Win లో గత వారం విడుదలైంది. విడుదలైన రోజు నుంచే మంచి బజ్ క్రియేట్ చేసి, ఓటీటీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపింది.

ఈ వెబ్ సిరీస్ చుట్టూ సస్పెన్స్, రసవత్తరమైన కథనం, ఎమోషనల్ టచ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. దాంతోనే మొదటి వారం నుంచే రికార్డు (Record) స్థాయిలో వ్యూస్ సాధించింది. ‘కానిస్టేబుల్ కనకం’ ఇప్పటికే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి కొత్త మైలురాయిని అందుకుంది. ఇది ETV Win కంటెంట్‌కి పెద్ద విజయంగా నిలిచింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని ETV Win ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ప్రేక్షకులు సిరీస్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వర్ష బొల్లమ్మ నటన, థ్రిల్లింగ్ టేకింగ్, టెన్షన్ క్రియేట్ చేసే కథనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో ‘కానిస్టేబుల్ కనకం’ ఓటీటీ ప్రేక్షకులకు తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్‌గా నిలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment